నవతెలంగాణ – హైదరాబాద్ : గుజరాత్‌లో ఎరువుల కర్మాగారంలో ఆదివారం తెల్లవారుజామున పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు సజీవదహనం కాగా, పలువురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. మెహ్సానా జిల్లాలో సమేత గ్రామ సమీపంలోని యూనిట్‌లో తెల్లవారుజామున 3.00గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయని పోలీస్ అధికారి వెల్లడించారు. మంటలను అదుపుచేసేందుకు సుమారు గంట సమయం పట్టిందని మెహ్సానా అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రమాద సమయంలో ప్లాంట్‌లో ఆరుగురు కార్మికులు ఉన్నారని అన్నారు. ప్లాంట్‌లో నైట్ షిప్ట్‌లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని మరణించారని అన్నారు. మరో ఇద్దరు గాయపడ్డారని, వారిని సమీప ఆస్పత్రికి తరలించామని అన్నారు. ప్రమాదానికి గల కారణంపై ఇంకా స్పష్టత లేదని అన్నారు. మృతులు బీహార్, మహారాష్ట్రకు చెందిన మనీష్, పుల్‌చంద్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తరలించామని, ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని అన్నారు.
ఎరువుల కర్మాగారంలో పేలుడు.. ఇద్దరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES