- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్‌పై దుష్ప్రచారం చేసే వారిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ఆపరేషన్ సిందూర్‌పై నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేసినా.. పోస్టులు పెట్టినా చర్యలు ఉంటాయని పేర్కొంది. సోషల్‌మీడియాను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అలాంటి సందేశాలు షేర్ చేసిన వారి వివరాలు 8712672222 నంబర్ వాట్సప్‌కి పంపించాలని సూచించింది.
- Advertisement -