Monday, September 15, 2025
E-PAPER
Homeజిల్లాలుమల్హర్‌రావు తహసీల్దార్ కార్యాలయం ఖాళీ..!

మల్హర్‌రావు తహసీల్దార్ కార్యాలయం ఖాళీ..!

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్‌రావు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఖాళీ అయింది.నిత్యం కార్యాలయానికి వివిధ సమస్యలపై ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడంతో రైతులు,విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులకు గురివుతున్నారు.ప్రస్తుతం కార్యాలయంలో తహశీల్దార్ రవికుమార్,డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్,టైపిస్టు సునీత తప్పా మిగతా పోస్టులన్నీ ఖాలివ్వడంతో సకాలంలో పనులు జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురివుతున్నారు.

కార్యాలయంలో ఆర్ఐ-1,ఆర్ఐ-2,సర్వేయర్,సీనియర్ అసిస్టెంట్,జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, అటెండర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే భర్తీ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం కావడంతో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన ప్రజలకు నిరాశ ఎదురైంది. అధికారులు ఉదయం 11గంటలైనా కార్యాల‌యానికి రాకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -