Monday, September 15, 2025
E-PAPER
Homeజిల్లాలుఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

- Advertisement -

నవతెలంగాణ-(వేల్పూర్)ఆర్మూర్: మండలంలోని కుకునూరు ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయ బృందం ఇటీవల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన.. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు టి.హరిచరణ్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు పతాని గంగాధర్ ,వేల్పూర్ మండల ఉత్తమ ఉపాధ్యాయుడు సి.హెచ్. చరణ్ దాస్ లను పూలమాల, శాలువా, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం శ్రీధర్ రావు, మల్కన్న, ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్, ఉపాధ్యాయ బృందం నరేందర్, నాగేంద్ర, స్రవంతి, రామకృష్ణ, అటెండర్ గంగు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -