నవతెలంగాణ-జన్నారం: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని సిఐటియు మండల కన్వీనర్ అంబటి లక్ష్మణ్ అన్నారు. సోమవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి మండల ఎంఈఓ విజయ్ కుమార్ కు వినతి పత్రం అందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనం పథకం బిల్లుల నిర్వహణను యుకుబేర్ నుండి మినహాయించాలన్నారు. పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన గ్యాస్ను ప్రతి పాఠశాలకు ఉచితంగా సరఫరా చేయాలనీ డిమాండ్ చేశారు. కొత్త మెనూకి అదనంగా బడ్జెట్ కేటాయించాలన్నారు.
ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం రూ. 10,000/-ల వేతనం పెంచి అమలు చేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణ ఆపాలన్నారు.నగదు బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. కార్మికులుగానే కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు..