- ఆల్ ఇండియా అంబెడ్కర్ సంఘం యువజన అధ్యక్షుడు రామగిరి రాజు
నవతెలంగాణ-మల్హర్‌రావు: జీపీఓలను లోకల్ వాళ్ళను కాకుండా నాన్ లోకల్ వాళ్ళను నియమించాలని ఆల్ ఇండియా అంబెడ్కర్ సంఘం యువజన మహముత్తారం మండల అధ్యక్షుడు రామగిరి రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో వీఆర్ఏలుగా విధులు నిర్వహించి, ప్రస్తుతం జిపిఓలుగా వస్తున్న వారిపై అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో పాసైన నూతన జిపిఓపై ఎలాంటి అభియోగాలు లేవు కావున వారినే నియమించాలని విజ్ఞప్తి చేశారు. భూప్రక్షాళన సమయంలో రైతుల నుంచీ లక్షల్లో డబ్బులు వసూలు చెసిన చరిత్ర పాత వాళ్లకు ఉందన్నారు.ప్రభుత్వం వీళ్లను కొత్త పేరుతో విధుల్లోకి తీసుకుంటే మళ్ళీ అక్రమ వసూళ్లకు పాల్పడటం ఖాయమని తెలిపారు. స్థానిక మండలానికి సంబంధించిన వారిని కాకుండా ఇతర జిల్లాల వారిని నియమించాలని కోరారు.