నవతెలంగాణ-జన్నారం: సిపిఐఎం మండల కార్యదర్శిగా కొండగుర్ల లింగన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి సంకే రవి పాల్గొన్నారు. సీనియర్ నాయకులు కే బుచ్చయ్య కనికరం అశోక్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది. సందర్భంగా నూతన కార్యదర్శి లింగన్న మాట్లాడుతూ రానున్న రోజుల్లో మండలంలో అన్ని గ్రామాల్లో సిపిఐ ఎం పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. పార్టీ నాయకులు అంతా తమకు సహకరించాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల తమ సత్తా చాటాలన్నారు. కార్యక్రమంలో మగ్గిడి జయ దాసండ్ల రాజన్న అంబటి లక్ష్మణ్ ఎస్.కె అబ్దుల్లా గుడ్ల రాజన్న జయ యశోద సువర్ణ తదితరులు పాల్గొన్నారు.