Monday, September 15, 2025
E-PAPER
Homeజిల్లాలువర్కింగ్‌ జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు

వర్కింగ్‌ జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు

- Advertisement -
  • భువనగిరి ఎమ్మెల్యే కుంభం హామీ
    నవతెలంగాణ-భువనగిరి: వర్కింగ్ జర్నలిస్టులందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్ది హామీ ఇచ్చారు. సోమవారం భువనగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీయూడబ్లు్యజే ఐజెయూ కమిటీ జిల్లా అధ్యక్షులు యంబ నర్సింహులు ఆధ్వర్యంలో ప్రతినిధులు కుంభంను కలిసి వర్కింగ్‌ జర్నలిస్టులకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే అత్యధికంగా జర్నలిస్టుల వృత్తిలో ఉన్నారని వివరించారు. అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారందరికి ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఙప్తి చేశారు. ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల జాబితాలో జర్నలిస్టులకు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు.

డివిజన్‌ కేంద్రం నుంచి మున్సిపాలిటీ కొనసాగుతున్న భువనగిరి జిల్లా కేంద్రంలో దశాబ్ధాలుగా పనిచేస్తున్న వారికి ఒక్కరికి కూడా ప్రభుత్వం గతంలో ఇల్లు మంజూరు చేయలేదన్నారు. అన్ని మండలాల్లో ఉన్న జర్నలిస్టులు కొన్నేళ్లుగా ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులకు రెండవ విడుత ఇందిరమ్మ జాబితాలో ఇళ్లను మంజూరు చేస్తానన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పై అలుపెరుగకుండా శ్రమిస్తున్న జర్నలిస్టులందరికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. జర్నలిస్టుల న్యాయమైన కోర్కెలనుప్రభుత్వ పరంగా తీర్చడానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామి ఇచ్చారు.

ఈ సందర్భంగా టీయూడబ్లు్యజే (ఐజేయూ) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త భట్టు రామచంద్రయ్య, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బర్రె జహంగీర్, యూనియన్‌ ప్రతినిధులు కందుకూరి సోమయ్య, పాశం నవీన్, పత్తిపాటి ఆనంద్, ఆరె కుమార్, ఎండీ జమాలోద్దీన్, బొడిగిదిలిప్, సతీష్, ముద్దం ఉదయ్‌రెడ్డి, మెరుగు అనిల్, ఎండీ జాకీర్,శత్రునాయక్,కనక బాలకృష్ణ, బొల్లేపల్లి కిషన్, దుబ్బ సురేష్, కూరెళ్ల శ్రీనివాస్, శంకర్, టీజేయూ అధ్యక్షుడు షానూర్‌ బాబ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -