- సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్: తెలంగాణ పల్లేలలో 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి సంవత్సర కాలం పాటు సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది భారత కమ్యూనిస్టుపార్టీ బిడ్డలు ప్రాణాలు అర్పించారని, తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా హుస్నాబాద్ మండలం మహ్మదపూర్ గ్రామంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజాం సంస్థానంలో భారతదేశంలో విలీనం కావాలని 1947 సెప్టెంబర్ 11న తెలంగాణ సాయుధ పోరాటన్ని రావి నారాయణరెడ్డి,మఖ్గూం మోయునోదిన్,
బద్దం ఎల్లారెడ్డి పిలుపునిచ్చారన్నారు..
తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రజలు అనతి కాలంలోనే చైతన్యవంతులయ్యరని గ్రామాలలో ఉన్న దొరల దేశముకుల భూస్వాముల ఆగడాల పైన వెట్టి చాకిరి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసి 3000 గ్రామాలను నిజం పాలన నుండి విముక్తి చేశారన్నారు.తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను చెరిపితే చెరిగిపోయేది కాదన్నారు. 1948 సెప్టెంబర్ 17న నిజం తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన సుదీర్ఘమైన పోరాటంలో ఇసుమంత కూడా బిజెపి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమాత్రం లేదని చాడ వెంకటరెడ్డి అన్నారు.
నేడు బిజెపి మారేడు కాయకు మసిబూసి నట్టు తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా ఆనాటి కేంద్ర హోం మంత్రిసర్దార్ వల్లభాయ్ పటేల్ నిజం నవాబ్ మెడలు మంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపినట్టు చెప్తున్నారని చాడ వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. సంవత్సరం కాలం పాటు జరిగిన ఈ పోరాటంలో అనేక వేల మంది హిందువులను చంపేస్తూ మహిళల మాన ప్రాణాలు తీసి అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్న నిజాం నవాబును ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ వచ్చి నేటికీ 13 సంవత్సరాలు గడుస్తున్నాా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపడానికి గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ప్రజా పాలనల సాగిస్తున్న కాంగ్రెస్ ఎందుకు ప్రకటించలేక పోతున్నాయో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి తెలంగాణ సాయుధ పోరాట యోధులు స్మృతి వనాలు నిర్మించి భవిష్యత్తు తరాలకు అనాటి పోరాట స్మృతులు చూపించాలని
చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్,సిద్దిపేట జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి గడిపె మల్లేశ్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కనుకుట్ల శంకర్ నాయకులు తదితది పాల్గొన్నారు.