నవతెలంగాణ-మల్హర్‌రావు: మండలంలోని 15 గ్రామపంచాయితీ బతుకమ్మ పండుగ, దసరా పండుగల నిర్వహణకు నిధుల మంజూరు చేయాలని మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఇంచార్జి ఎంపిడిఓ శ్రీరామ్మూర్తికి ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్సులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు గ్రామాల్లో పనిచేస్తున్న ఎంపీడబ్ల్యూ సిబ్బందికి గత రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆర్థికపరమైన ఇబ్బందులు, శానిటేషన్ నిర్వహణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులు పట్టించుకోని తమ సమస్యలను పరిస్కారం చేయాలని కోరారు.ప్రస్తుతం జిపిల్లో నిధుల కొరత ఉన్నందున పండగ అవసరాలకు తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు పెట్టించేలా చూడాలని ఎంపిడిఓకు విన్నవించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం గౌరవ అధ్యక్షుడు సిహెచ్ మల్లిఖార్జున రెడ్డి,అధ్యక్షుడు చెలుకల రాజు యాదవ్,ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రాజు,రజిత,సతీష్,భాస్కర్ రెడ్డి,రాజు,స్వామి పాల్గొన్నారు.