- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం ముందు మంగళవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం నుంచి రైతులు పట్టా పాస్ బుక్ లతో ఆఫీస్ ముందు క్యూ లైన్‌లో నిలబడ్డారు. పంట పొట్ట దశలో ఉందని, తమకు సకాలంలో యూరియా పంపిణీ చేయాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా అందకపోతే పంట దిగుబడి తగ్గుతుందని వాపోయారు.
- Advertisement -