నవతెలంగాణ-మద్నూర్: ప్రతి సంవత్సరం బాలాజీ జెండాకు మండల కేంద్రంలోని గాంధీ చౌక్ ఆవరణంలో 11 రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కూడా బాలాజీ జెండా వద్ద మంగళవారం గ్రామస్తులు జెండా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జెండా ఉత్సవాలు ఏళ్ల తరబడి కొనసాగుతున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
బాలాజీ జెండా ప్రతి సంవత్సరం మహారాష్ట్రలోని దెగ్లూరు పట్టణం నుండి మద్నూర్ కు చేరుకొని ఇక్కడ 11 రోజులపాటు పూజలు అందుకున్న తర్వాత.. ఇక్కడి నుండి కొడిచెర మీదుగా దన్నూర్ జుక్కల్ చేరుకొని అక్కడి నుండి తిరుపతికి వెళుతుందని భక్తులు తెలిపారు. మండల కేంద్రంలో బాలాజీ జెండా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవ కమిటీ నిర్వహకులు డాక్టర్ రమణ, గంపల గంగాధర్, కృష్ణ గౌడ్ ఇతర కలిసి ఉత్సవాలు విజయవంతం చేశారు.