నవతెలంగాణ-హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో బుధవారం ‘హైదరాబాద్ లిబరేషన్ డే’జరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 8.55 గంటలకు పరేడ్ గ్రౌండ్‌కు ఆయన చేరుకుంటారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. సీఆర్‌పీఎఫ్, ఇతర బలగాలు నిర్వహించే పరేడ్‌ను వీక్షిస్తారు. పారామిలటరీ దళాల ప్రత్యేక పరేడ్ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమం పూర్తయ్యాక జూబ్లీ బస్టాండ్‌కు సమీపంలోని కంటోన్మెంట్ పార్క్‌లో ఏర్పాటు చేసిన భారతరత్న, మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి విగ్రహాన్ని రాజ్‌నాథ్‌సింగ్ ఆవిష్కరి స్తారు. అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళతారు.
హైదరాబాద్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES