
నవతెలంగాణ- కంటేశ్వర్టే
సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి పోలీస్ శాఖ ద్వారా 35 సెల్ఫోన్లను రికవరీ సి బాధితులకు నిజామాబాద్ అదనపు డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ జయరామ్ వెల్లడించారు. నిజాంబాద్ నగరంలోని ఒకటో పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులకు గల వివరాలు ఇలా ఉన్నాయి. ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలో వివిధ తేదిలలో,వివిధ ప్రదేశాలలో బాధితులు పోగొట్టున్న వారి యొక్క చరవాణి లను సి ఈ ఐ ఆర్ పోర్టల్ సహాయం ద్వార వారి యొక్క మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి దాదాపు 6 లక్షలు విలువ చేసే 35 ఫోన్లను సంబదిత భాదితులకు జిల్లా పోలీస్ కార్యాలయం లోని కమాoడ్ కంట్రోల్ మీటింగ్ హాల్ లో అప్పగించినట్టు శుక్రవారం తెలియజేశారు.
ఈ సందర్బంగా అదనపు పోలీస్ డిప్యూటీ కమీషనర్ ( ఎల్ అండ్ ఓ ) ఎస్. జయ్ రామ్, నిజామాబాదు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్, టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ రాజు, ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు, టెక్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ l యాకుబ్ అలీ తదితరులు గలరు. 35 సెల్ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు అప్పగించడం గొప్ప విషయం అని ఈ సందర్భంగా తెలుపుతూ ఒకటవ పోలీస్స్టేషన్ ఎస్ఐ విజయ్ బాబు కు తన తోటి సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు. తమ విధులను ఇదే విధంగా కొనసాగించాలని కోరారు. ఇప్పటివరకు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు తోపాటు తమ సిబ్బంది ఎంతో కష్టపడ్డారని ఇంకా కష్టపడి నేరాల నియంత్రణకు కృషి చేయాలని తెలుపుతున్నాను అన్నారు.