Wednesday, September 17, 2025
E-PAPER
Homeజాతీయంఏపీలో నిలిచిన ‘ఆరోగ్యశ్రీ’

ఏపీలో నిలిచిన ‘ఆరోగ్యశ్రీ’

- Advertisement -

నవతెలంగాణ–హైదరాబాద్‌: సూప‌ర్ సిక్స్.. సూప‌ర్ హిట్ అంటు ఆర్భాటం చేసిన‌ ఎన్డీయే కూటమి ప్ర‌భుత్వం జన‌సేన‌-టీడీపీకి నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ భారీ షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ఓపీడీ సేవల నిలిపివేస్తున్న‌ట్లు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. చర్చలు జరిగే వరకు ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్ధరించబోమని తేల్చి చెప్పారు. ఇక, ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. CFMSలో పెండింగ్‌లో ఉన్న రూ. 674 కోట్లు కలిపి మొత్తం రూ. 3,800 కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయని వారు ఆరోపణలు చేస్తున్నారు. ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించడం కష్టమైందని ఆస్పత్రుల అసోసియేషన్ చెబుతోంది. ఆస్ప‌త్రుల‌కు బాకాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో ఆ ప‌థ‌కం కింద లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చర్చలు ఎప్పుడు జరుగుతాయో, తిరిగి సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారో అని ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.

అయితే, త్వరలో బకాయిలు చెల్లిస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హామీ ఇచ్చారు. కానీ, ఈ హామీపై ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు విశ్వాసం చూపకపోగా, సమస్యపై తుది పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఒక సమావేశం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -