Wednesday, September 17, 2025
E-PAPER
Homeజాతీయంఈ నెల 19న ‘ఇండియా బ్లాక్’ కీలక సమావేశం

ఈ నెల 19న ‘ఇండియా బ్లాక్’ కీలక సమావేశం

- Advertisement -

నవతెలంగాణ–హైదరాబాద్‌: ఈ ఏడాది చివ‌ర‌లో బీహర్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అందుకు కేంద్ర ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ చేయ‌డ‌మే త‌రువాయి. ఈక్ర‌మంలో బీహార్ రాష్ట్రంలో రాజ‌కీయ‌ పార్టీలు ముంద‌స్తు ఎన్నిక‌ల‌ ప్ర‌చారాల‌తో హోరెత్తిస్తున్నాయి. ఇండియా బ్లాక్ కూట‌మి..ఆ రాష్ట్ర ప్ర‌ధాన ప‌క్షం రాష్ట‌య్ జ‌న‌తా ద‌ళ్‌(ఆర్జేడీ) ముందు వ‌ర‌సలో ఉన్నాయి. ఓట్ల చోరీ, ఓట‌ర్ అధికార్ యాత్ర పేరుతో జ‌న‌బ‌హుళ్యంలోకి చొచ్చుకెళ్తున్నాయి. తాజాగా బీహార్‌లోని ప్రతిపక్ష ఇండియా కూటమిలో నెలకొన్న సీట్ల పంపకాల ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్‌ ఈ నెల 19న కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మిత్రపక్షంగా ఉన్న ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీలో ఉంటామన్న ప్రకటన నేపథ్యంలో ఈ భేటీని తలపెట్టినట్లు తెలుస్తోంది. పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతో పాటు, పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు ఇచ్చే స్థానాలపై ఈ భేటీలో ఓ స్పష్టత తేవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -