నవతెలంగాణ–హైదరాబాద్: చార్లీ కిర్క్ హంతకుడు రాబిన్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చార్లీ కిర్క్.. ‘గే’ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది తప్పంటూ ప్రసంగాలు చేస్తున్నారు. పురుషుడు-పురుషుడు, స్త్రీ-స్త్రీ వివాహం చేసుకోవడం ప్రకృతి విరుద్ధమంటూ ఆయా సభల్లో చార్లీ కిర్క్ ప్రసంగాలు చేస్తున్నారు. ఈ కారణంతోనే రాబిన్సన్ కోపంతో రగిలిపోయి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. చార్లీ కిర్క్ ద్వేషాన్ని రగిలిస్తున్నారని.. ఆ కారణంతోనే నిందితుడు చంపినట్లుగా కోర్టుకు దాఖలు చేసిన పత్రాల్లో పోలీసులు పేర్కొన్నారు.. ద్వేషం తనకు విసుగు తెప్పించిందని.. కొన్ని ద్వేషాలను పరిష్కరించలేమని రాబిన్సన్ తన భాగస్వామితో పంచుకున్న టెస్ట్ మెసేజ్ వెలుగులోకి వచ్చింది.హత్య గల కారణాలను నిందితుడు ముందుగానే ఒక నోట్‌పై రాశాడు.
గత బుధవారం అమెరికాలోని ఉతా వ్యాలీ యూనివర్సిటీలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతుండగా దుండగుడు జరిపిన తుపాకీ కాల్పులకు చార్లీ కిర్క్ కుప్పకూలి ప్రాణాలు వదిలారు. అనంతరం 33 గంటల తర్వాత 22 ఏళ్ల నిందితుడు టైలర్ రాబిన్సన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.