నవతెలంగాణ -సుల్తాన్ బజార్
రైళ్లలో చోరీ లకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నింది తుల నుంచి రెండు లాప్టాప్ లు, 26 ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డీఎస్పీ జావేద్, హైదరాబాద్ రైల్వే ఇన్ స్పెక్టర్ బి. ప్రవీణ్ కుమార్, లింగంపల్లి ఆర్పీఎఫ్ సీఐ రవి, ఆర్పీఎఫ్ ఎస్సై భాషా మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్ణాటక.. గుల్బర్గాకు. చెందిన ప్రశాంత్(31), గోపాల్(27) వృత్తిరీత్యా కూలీలు. జల్సాలకు అలవాటు పడి కొంత కాలంగా రైళ్లు, రైల్వేస్టేషన్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నారు. బేగంపేట్, లింగంపల్లి రైల్వేస్టేషన్ ల లో ఓ ప్రయాణికుడి ల్యాప్ టాప్, మరో వ్యక్తి నుంచి సెల్ ఫోన్ లు దొంగతనం చేశారు. సోమవారం రాత్రి జీ ఆర్ పి సీఐ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో నాంపల్లి రైల్వేస్టేషన్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానంగా కనిపించిన ఇద్దరినీ అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. రెండు ల్యాప్ టాప్ లు, 26 ఫోన్ లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు