Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ప్రజా ప్రజాపాలన దినోత్సవం వేడుకలు

ఘనంగా ప్రజా ప్రజాపాలన దినోత్సవం వేడుకలు

- Advertisement -

నవ తెలంగాణ – ఆత్మకూరు : తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం వేడుకలు ఆత్మకూరు మండల వ్యాప్తంగా ఆయా అధికార కార్యాలయాల్లో అధికారులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో స్థానిక తాసిల్దార్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి. పుర ప్రముఖులకు, అధికారులకు ఆనఅధికారులకు , ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి బి.నిర్మల, స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ ఆర్ సంతోష్, మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద మండల వ్యవసాయ అధికారి పి యాదగిరి,మండల పీహెచ్సీ లో డాక్టర్ పి స్వాతి , ఆత్మకూరు సోసైటి లో చైర్మన్ ప్రభాకర్ గౌడ్, నీరు కుళ్ళు సోసైటిలో చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి లు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఎందరో మహనీయుల త్యాగాలు ఫలితమే నేటి శుభదినం అని తెలంగాణ సాయుధ పోరాట అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -