- Advertisement -
నవతెలంగాణ-పరకాల : ప్రజాపాలన దినోత్సవం వేడుకలు పరకాల మండలంలో ఘనంగా జరిగాయి. పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయను ప్రసంగిస్తూ ప్రజలకు సేవ చేయడం ప్రతి ఉద్యోగి ధర్మమని, పరిపాలనా వ్యవస్థ బలోపేతానికి అందరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్. శైలశ్రీ, ఏపీఓ ఇందిర, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ పతాకానికి వందనం తెలియజేసి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలనే సంకల్పంతో అంకితభావంతో పనిచేస్తామని సిబ్బంది పేర్కొన్నారు.
- Advertisement -