Wednesday, September 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలి: మంత్రి దామోదర

ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలి: మంత్రి దామోదర

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాష్ట్రంలోని ప్రయివేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ను తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. గత తొమ్మిదిన్నరేళ్లలో చేయని సమ్మె ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. ‘‘గత ప్రభుత్వంలో నెలకు రూ.50కోట్లు కూడా రిలీజ్‌ అవ్వలేదు. మేం రూ.100 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాం. ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో లేకపోవడంతో మేం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ప్రజలకు ఆరోగ్య సేవలో ఎలాంటి అంతరాయం కలగదు’’ అని దామోదర రాజనర్సింహ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -