- Advertisement -
నవతెలంగాణ -ముధోల్ : ముధోల్ మండలంలోని బ్రహ్మంన్ గావ్ గ్రామంలో ప్రభుత్వ భూములను కాపాడాలని మాజీ ఎంపీటీసీ సాయ రేడ్డి ఆధ్వర్యంలో బుధవారం రోజు గ్రామ అభివృద్ధి కమిటీ, కురుమ సంఘం, గ్రామస్తులు తాసిల్దార్ శ్రీలతకు వినతి పత్రం అందజేశారు. తమ గ్రామంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురికావడంతో పశువులకు, గొర్రెలు మేకలకు మేత కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అలాగే గ్రామంలో ఉన్న చెరువుల శిఖం భూములు కబ్జాకు గురిఅవుతున్నయని వారు పేర్కొన్నారు. ఈ భూములను కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, కురుమ సంఘం సభ్యులు, గ్రామస్తులు, నాయకులు తదితరులు, పాల్గొన్నారు.
- Advertisement -