Wednesday, September 17, 2025
E-PAPER
Homeఖమ్మంపోషణ మాసోత్సవం  విజయవంతం చేయండి  

పోషణ మాసోత్సవం  విజయవంతం చేయండి  

- Advertisement -

– సీడీపీఓ ముత్తమ్మ
నవతెలంగాణ – అశ్వారావుపేట
: ఈ నెల 17 నుండి అక్టోబరు 16 వరకు నిర్వహించే జాతీయ పోషణ మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని ఐసీడీఎస్ సీడీపీఓ ముత్తమ్మ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం అంగన్వాడీ ఉపాద్యాయులు, ఐసిడిఎస్ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు.తర్వాత  ముత్తమ్మ మాట్లాడుతూ పోషణ మాసం కార్యక్రమానికి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని,ప్రతి కార్యక్రమంలో గ్రామంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యే లాగా పోషణ స్థితి,  ఆహార పద్ధతులను మార్చుకునే విధంగా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపిఓ  అలేఖ్య,సూపర్వైజర్లు సౌజన్య, పద్మావతి,రమాదేవి,వరలక్ష్మి, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -