Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా పాలన దినోత్సవం..జాతీయ జెండా ఆవిష్కరించిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్

ప్రజా పాలన దినోత్సవం..జాతీయ జెండా ఆవిష్కరించిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్

- Advertisement -

– నిజాం నిరంకుశ పాలనను చిత్తు చేసిన తెలంగాణ ప్రజల స్ఫూర్తి –  పంతకాని తిరుమల – సమ్మయ్య
నవతెలంగాణ-కాటారం : కాటారం మండల మార్కెట్ కమిటీ– కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగాజాతీయ జెండాను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల ఎగురవేశారు.ఈసందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ… ఏళ్ల తరబడి నిజాం పాలనలో నిరంకుశత్వాన్ని అనుభవించిన తెలంగాణ, అఖండ భారతదేశంలో కలిసిన రోజు ఇదే. మనరాష్ట్రానికి స్వేచ్ఛను అందించినది ప్రజలే చేసిన సాయుధ పోరాటం. అలాంటిచారిత్రక క్షణాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ రోజును అధికారికంగా ‘ప్రజా పాలనదినోత్సవం’గా జరుపుకుంటున్నాం అన్నారు.అలాగే ఆయన, ప్రాణత్యాగాలతో ఏర్పడినతెలంగాణలో పాలన ఎల్లప్పుడూ పారదర్శకంగా ఉండాలి. అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వంసంస్కరణల ద్వారా 24 లక్షల ఎకరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకుకేటాయించింది. పోడు భూములకు పట్టాలు ఇవ్వడం కూడా అప్పటి కేంద్ర కాంగ్రెస్ప్రభుత్వమే చేసింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను విస్తృతస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతోందిఅని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కాటారం సబ్ డివిజన్ ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,మార్కెట్ కమిటీ సెక్రటరీ, కార్యాలయసిబ్బంది,కాంగ్రెస్ సీనియర్ నాయకులు పంతకాని సమ్మయ్య , మండల ముఖ్య నాయకులు,మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -