Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర ప్రస్తుత సమాజానికి అవసరం

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర ప్రస్తుత సమాజానికి అవసరం

- Advertisement -

– విద్యార్థి యువజనలు సాయుధ పోరాటాన్ని అధ్యయనం చేయాలి
– వైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సాయుధ పోరాట వారోత్సవాల సభలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్యా నవీన్
న‌వ‌తెలంగాణ‌-కాటారం :
డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాటారం మండలం ఓడిపిలవంచ గ్రామంలో బుధవారం రోజున గుడి కందుల దేవేందర అధ్యక్షతన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సభను నిర్వహించడం జరిగింది. ఈ సభకు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్యా నవీన్ కెవిపిఎస్‌ జిల్లా నాయకులు ఆత్కూరి శ్రీధర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సభను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ…తెలంగాణలో నైజాం సర్కారు వారి నీడలో విసునూరు రామచంద్రారెడ్డి లాంటి దొరల పాలనను వ్యతిరేకిస్తూ భూమికోసం,భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను ఎండగట్టారు. ఆనాడు జరిగిన ఆంధ్ర మహాసభలో తెలంగాణ స్వరూపాన్ని తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆకృత్యాల్ని పుచ్చలపల్లి సుందరయ్య గారికి విన్నవించిన తర్వాత ప్రజల పోరాటం ఉదృతం అవుతున్న దశలో ప్రజల పిలుపుమేరకు కమ్యూనిస్టులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి పోరాటాన్ని ఉధృతం చేశారు. దాదాపు నిజాం సర్కార్ సైన్యానికి 1500 మంది కమ్యూనిస్టు నాయకులు అమరులయ్యారని, 1948 ఆనాటి కాంగ్రెస్ హోం మంత్రి ఉన్నటువంటి వల్లభాయ్ పటేల్ గారి ఆర్మీ బలగాలు దిగడంతోని తెలంగాణలో నిజాం సర్కార్ను లొంగదీసుకునే క్రమంలో దాదాపు 2500 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు బాలయ్యారు. కమ్యూనిస్టుల త్యాగాల ఫలితం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నాయయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కానుంచి మొదలుకుంటే మల్లు స్వరాజ్యం వరకు ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త తెలంగాణలో కులమత భేదాలు లేకుండా నిజాం సర్కార్ను దొరల గడీలను వారి పాలనను అంతం చేసేందుకు పోరాటాల నిర్వహించారు. దాంట్లో ముద్దు మొహిద్దిన్, సోయబిల్ల ఖాన్, షేక్ బందగి, లాంటి ఎంతోమంది వీరులు ఈ పోరాటంలో పాల్గొన్నారు. కమ్యూనిస్టులు ఆధ్వర్యంలో దాదాపు పది లక్షల ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు పంచారు. మళ్లీ వెనక్కి తీసుకోవడం కోసం ఆనాడు కేంద్రం ఇచ్చిన గవర్నర్ హోదా రాజ్ ప్రముఖుగా నిజాంకి ఇచ్చినటువంటి హోదాను అడ్డం పెట్టుకొని భూములను లాక్కునే అటువంటి ప్రయత్నం చేశారు. దాని వ్యతిరేకిస్తూ ప్రజలకు దున్నినోడికే భూమి ఇవ్వాలి అని కమ్యూనిస్టులు మరో పోరాటం నిర్వహించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 46 నుంచి 51 వరకు నిర్వహించబడిందని అన్నారు.ఎక్కడ కూడా ప్రజలంతా మతాలకు వ్యతిరేకంగా పోరాట నిర్వహించలేదని అన్నారు.కులమత ప్రాతిపదికన ఈ పోరాటం నిర్వహించబడలేదని ప్రజలంతా ఐక్యమై దొరకడీల పాలనను అంతమొందించి తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ స్వతంత్రాలను నెలకొల్పేందుకు ఎంతో మంది కమ్యూనిస్టులు అమరులయ్యారు. ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రాలను కలుగజేస్తే తెలంగాణ రాష్ట్ర సాధనకు బీజం వేస్తే కొంత మంది మతోన్మాదులు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినాను సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థి యువజన లోకమంతా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను అధ్యయనం చేయాలని, వక్రీకరిస్తున్న వారిని తిప్పి కొట్టాలి అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -