నవతెలంగాణ-కాటారం : బుధవారం రోజున కాటారం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో స్వస్తినారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్త్రీల ఆరోగ్యాల పట్ల స్త్రీలకు అవగాహన కల్పించి వీరికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. క్యాన్సర్ వ్యాధి గురించి, బ్రెస్ట్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, అండాసియా క్యాన్సర్ ఇవే కాకుండా అన్ని రకాల స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు కంటి, టీబి వ్యాధుల గురించి పరీక్షలు నిర్వహిస్తారు. ఈరోజు నుండి 17/9/2025 మొదలుకొని అక్టోబర్ రెండో తారీకు వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో క్యాంపులు నిర్వహించి వారికి తగిన సూచనలు మందులు వైద్యానికి సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేయించడం జరుగుతుంది. అని స్థానిక వైద్యాధికారిని డాక్టర్ ఎం మౌనిక స్త్రీలకు అవగాహన కల్పించారు. కార్యక్రమం లో ఎంపీడీవో బాబు, స్థానిక వైద్యాధికారిణి డాక్టర్ ఎ మౌనిక, డాక్టర్ హారిక, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిర్మల, మహిళా హెల్త్, సూపర్వైజర్ సరళ,ల్యాబ్ టెక్నీషియన్ సాగర్, హెల్త్ అసిస్టెంట్లు నిర్మల, కుమ్మరి రజిత,ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వాస్తి నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES