– విస్తృతంగా ఎస్టీయూ సభ్యత్వాలు
– నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీధర్ రావు
నవతెలంగాణ – తిమ్మాజిపేట : సీపీఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ ను అమలు చేయాలని ఎస్ టి యు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీధర్ రావు అన్నారు. బుధవారం మండలంలోని పోతిరెడ్డిపల్లి, గోరిటా, తిమ్మాజిపేట ఉన్నత పాఠశాలలతో పాటు గుమ్మకొండ, కోడుపర్తి, సిపిఎస్ తిమ్మాజిపేట వైఎస్ కాలనీ మొదలైన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్ టి యు) సభ్యత్వాలు చేయించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ ను అమలు చేయాలని, ఉపాధ్యాయు లకు అందవలసిన బకాయిలను ప్రభుత్వము విడుదల చేయాలని, పిఆర్సి రిపోర్టు తెప్పించి ఐదు డిఏ లను చెల్లించాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ 2018 రాష్ట్రపతి ప్రెసిడెంట్షియల్ ఉత్తర్వుల మేరకు రూపొందించాలని లేనిచో డైట్ లెక్చరర్స్ , జేయల్స్, ఎంఈవో వంటి పర్యవేక్షక పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కాదని ఈ సందర్భంగా వారు అన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తో ప్రభుత్వం వెంటనే ప్రధాన ఉపాధ్యాయ సంఘాల సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కే రమేష్ నాగర్ కర్నూల్ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మండల అధ్యక్ష కార్యదర్శులు వెంకటస్వామి, కార్తీక్, అమరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ ను అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES