– హాజరైన ఎమ్మెల్యే జారె
– క్యాంప్ కార్యాలయం, వ్యవసాయ కళాశాల,తహశీల్దార్,మున్సిపాల్టీ లో పతాకావిష్కర్ణలు
నవతెలంగాణ – అశ్వారావుపేట : ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మండల వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అధికారులు మ,పోలీస్,కాంగ్రెస్ నాయకులు వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాపాలనలో మా ప్రభుత్వం ప్రజలతో కలిసి పనిచేస్తుందని ప్రతి పథకం ప్రతి నిర్ణయం ప్రజల మేలు కోసం పారదర్శకంగా అమలు చేస్తుందని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి తెలంగాణ ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
తహశీల్దార్,సీఐ,మున్సిపాల్టీ,ఎంపీడీఓ,వ్యవసాయ కళాశాల,ఆయిల్ ఫెడ్ డీవో,పామాయిల్ పరిశ్రమ కార్యాలయాల్లో తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ, సీఐ నాగరాజు రెడ్డి,కమీషనర్ నాగరాజు, అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్,డీవో రాధాక్రిష్ణ,మేనేజర్ నాగబాబు లు పతాకావిష్కరణ లు చేసారు.
ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES