Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్హర్‌రావు మండలంలో ప్రజా పాలన దినోత్సవం వేడుకలు

మల్హర్‌రావు మండలంలో ప్రజా పాలన దినోత్సవం వేడుకలు

- Advertisement -

పిఏసిఎస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవం

నవతెలంగాణ-మల్హర్‌రావు:
మండల కేంద్రమైన తాడిచెర్ల పిఏసిఎస్ కార్యాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం వేడుకలు నిర్వహించి,జాతీయ పతాకాన్ని ఎగురవేసినట్లుగా చైర్మన్ ఇప్ప మొoడయ్య తెలిపారు.ఈ సందర్భంగా సందర్భంగా చైర్మన్ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజాప్రయోజన కార్యక్రమాలను గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతు బంధు, రుణమాఫీ విద్యార్థి సంక్షేమ పథకాలు, ఆరోగ్య పరిరక్షణ పథకాలు,ఇందిరమ్మ ఇళ్లు,మహిళల అభ్యున్నతి కోసం చేపడుతున్న చర్యలు,ప్రతి కుటుంబానికి మేలు చేకూరుస్తున్నాయని కొనియాడారు.నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజల అవసరాలు విని, వాటికి సమాధానం చెప్పడం అని, ఆ మార్గంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు,ప్రజలే పాలనకు మూలస్థంభమని భావిస్తూ ప్రభుత్వం ప్రజలతోనే ప్రజల కోసం పనిచేస్తోందని హర్షం వ్యక్తం చేశారు.ప్రజా పాలన దినోత్సవం” ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని దీనిని కొనసాగించేలా ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి చింతలపల్లి మలహాల్ రావు.తహశీల్దార్ రవికుమార్, సింగిల్ విండో డైరెక్టర్ వొన్న తిరుపతి రావు,సిబ్బంది పాల్గొన్నారు.

పెద్దతూoడ్ల హైస్కూల్లో..
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం మండలంలోని పెద్దతూoడ్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి,జాతీయ పతాకావిష్కరణను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతి చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు సిహెచ్ శర్మ, ఐత మహేందర్, యాకూబ్ పాషా, గోపి నాయక్, మానస, సుజాత,రమేష్ ,రవీందర్, ఓఎస్ సందీప్, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -