Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాథమిక పాఠశాలల బలోపేతమే ఎస్జిటియు లక్ష్యం

ప్రాథమిక పాఠశాలల బలోపేతమే ఎస్జిటియు లక్ష్యం

- Advertisement -

-ఎస్జిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి..
నవతెలంగాణ -రాయపోల్

ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన పదోన్నతుల కారణంగా ప్రాథమిక పాఠశాలలలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందని, తద్వారా విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని,అందువల్ల వెంటనే తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఒక ప్రధానోపాధ్యాయులను నియమించాలని ఎస్జిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం రాయపోల్ మండలం ప్రాథమిక పాఠశాలలో సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగానికి ప్రాథమిక పాఠశాలలే పునాది అని, కానీ ప్రభుత్వాలు ప్రాథమిక విద్యా రంగం పై సరైనా దృష్టి సారించడం లేదన్నారు.

ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు కలిసి ప్రధానోపాధ్యాయ బాధ్యతలు నిర్వర్తిస్తూ 18 సబ్జెక్ట్ లు బోధిస్తే నాణ్యమైన విద్యా ఎలా అందుతుందని ప్రశ్నించారు.కనీసం ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు,ఒక ప్రధానోపాధ్యాయుడు నియమించి పర్యవేక్షణ పటిష్టoగా చేయాలని కోరారు. అలాగే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు శాసన మండలి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాయపోల్ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ, రాష్ట్ర నాయకులు ప్రవీణ్ రెడ్డి,కరుణాకర్,ప్రవీణ్ కుమార్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -