Friday, September 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంAdani Group: అదానీకి భారీ ఊరట..

Adani Group: అదానీకి భారీ ఊరట..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్‌కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి భారీ ఊరట లభించింది. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన సంచలన ఆరోపణల కేసులో అదానీ గ్రూప్‌నకు క్లీన్‌చిట్ ఇస్తున్నట్లు సెబీ ప్రకటించింది. అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల్లోకి అక్రమంగా నిధులు మళ్లించిందనడానికి గానీ, స్టాక్ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడిందనడానికి గానీ ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది.

గత ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్ సంస్థ, అదానీ గ్రూప్‌పై అకౌంటింగ్ మోసాలు, నిధుల అక్రమ మళ్లింపు వంటి తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై 18 నెలలకు పైగా సుదీర్ఘ దర్యాప్తు జరిపిన సెబీ, వాటిలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించి గురువారం రెండు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మ్యానిపులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -