Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంనూతన పోప్‌గా రాబర్ట్‌ ప్రవోస్ట్‌

నూతన పోప్‌గా రాబర్ట్‌ ప్రవోస్ట్‌

- Advertisement -

– పోప్‌ లియోగా నామకరణం
వాటికన్‌:
నూతన పోప్‌గా అమెరికాకు చెందిన రాబర్ట్‌ ప్రవోస్ట్‌ ఎన్నికయ్యారు. ఆయన్ను పోప్‌ లియో గా పిలవనున్నారు. 133 మంది కార్డినల్‌లు శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. అత్యంత రహస్యంగా సమావేశమై తదుపరి పోప్‌ను ఎన్నుకున్నారు. దీనికి సూచనగా వాటికన్‌లోని ప్రాచీన సిస్టిన్‌ చాపెల్‌ చర్చి పొగగొట్టం నుంచి తెలుపురంగు పొగ వెలువడింది. పోప్‌గా ఓ అమెరికన్‌ ఎన్నిక కావడం చరిత్రలోనే ఇది తొలిసారి.నూతన పోప్‌ ఎన్నిక ఖరారుతో ప్రజల హర్షధ్వానాలతో సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌ హౌరెత్తింది. అత్యున్నత కార్డినల్‌ నూతన పోప్‌ పేరు ప్రకటించారు. తొలుత నూతన పోప్‌ పుట్టిన పేరును లాటిన్‌లో చదివి, అనంతరం ‘పోప్‌ లియో’ పేరును వెల్లడించారు. అనంతరం నూతన పోప్‌ తొలిసారి ప్రజలకు బహిరంగంగా కనిపించారు. ఇటీవల పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూతతో ఈ ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad