- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండి.. భక్తులు స్వామివారి దర్శనం కోసం శిలాతోరణం వరకూ క్యూలైన్లో వేచి ఉన్నారు. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ఇప్పటి నుంచి క్యూలైన్లోకి వెళ్లేవారికి 15-20 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 6 గంటలు, రూ.300 శీఘ్రదర్శనమునకు 4 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న స్వామివారిని 68,095 మంది భక్తులు దర్శించుకోగా.. 23,932 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు వచ్చింది.
- Advertisement -