Friday, September 19, 2025
E-PAPER
Homeక్రైమ్లైంగికదాడి కేసులో లలిత్ మోడీ సోదరుడు అరెస్ట్

లైంగికదాడి కేసులో లలిత్ మోడీ సోదరుడు అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ సోదరుడు సమీర్ మోడీ తీవ్రమైన ఆరోపణలతో చిక్కుల్లో పడ్డారు. లైంగికదాడి, క్రిమినల్ బెదిరింపుల కేసులో ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐదు రోజుల క్రితం ఓ మహిళ సమీర్ మోడీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తనపై సమీర్ లైంగికదాడికి పాల్పడ్డారని, బెదిరింపులకు గురిచేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు లైంగికదాడి, క్రిమినల్ బెదిరింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం విమానాశ్రయంలో సమీర్ మోడీని అరెస్ట్ చేసినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -