నవతెలంగాణ-హైదరాబాద్: ఎస్ఐఆర్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గళమెత్తిన విషయం తెలిసిందే. ఓ సాప్ట్‌వేర్ సృష్టించి కర్నాటక, మహారాష్ట్ర, బీహార్ తోపాటు తదితర రాష్ట్రాల్లో విపక్షాల అనుకూల ఓట్లు తొలగింపే లక్ష్యంగా బీజేపీతో కలిసి ఈసీ రాజ్యాంగ హక్కును కాలరాస్తోందని నిన్న మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ విమర్శించారు. ఈసీ ఓట్ల చోరీని ఖండిస్తూ ఆగష్టు నెలలో ఓటర్ అధికార్ యాత్రను కూడా చేపట్టారు. తాజాగా మరోసారి ఓట్ల చోరీని నిరసిస్తూ ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, త్వరతగతిన ఓట్ల అక్రమ తొలగింపు ప్రక్రియను అడ్డుకొవాలని శుక్రవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా దేశ యువతకు ఎంపీ ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.
సర్వే పేరుతో ప్రజాస్వామ్యంలో కీలకమైనా ఓటు హక్కును నిర్మూలించే కుట్ర జరుగుతుందని, దాని నివారించే క్రమంలో దేశ యువత పోరాటానికి సిద్ధంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ తమ సంతకంతో ఓట్ల చోరీ బాగోతాన్ని ఖండించాలని ఆమె పేర్కొన్నారు.
“ప్రతి సంతకం ప్రతి ఓటు లాగే ముఖ్యమైనది. మాతో చేరండి ‘ఒక మనిషి, ఒక ఓటు’ అనే మన ప్రజాస్వామ్య సూత్రాన్ని రక్షించడానికి మీ మద్దతును తెలియజేయండి. ప్రతి వ్యక్తి ఓటు హక్కు కోసం మనల్ని శక్తివంతమైన ప్రజాస్వామ్యంగా మార్చే మన ప్రతిష్టాత్మకమైన రాజ్యాంగ విలువలను రక్షించడానికి మేము పోరాడుతున్నాము. ప్రియాంక్ గాంధీ రాసుకొచ్చారు.