Friday, September 19, 2025
E-PAPER
Homeజాతీయంతమిళ వెట్రి కజగం చీఫ్ ఇంట్లో చోరీ

తమిళ వెట్రి కజగం చీఫ్ ఇంట్లో చోరీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తమిళ వెట్రి కజగం చీఫ్‌ విజయ్ ఇంట్లో చోరీ జ‌రిగింది. ఒక అగంతకుడు నీలంకరైలోని విజయ్‌ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంటి టెర్రస్‌పై తిరుగుతూ కనిపించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు అరుణ్‌ (24)గా గుర్తించారు. గత నాలుగేళ్లుగా అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, స్టార్‌ నటుడు అయిన విజయ్‌ దళపతి గతేడాది రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని ప్రకటించారు. ఇక 2026లో జరిగే ఎన్నికల బరిలో దిగుతామని పార్టీని ప్రారంభించిన సమయంలోనే విజయ్ ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -