నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఈసీ..ఓట్ల దొంగలకు అండగా ఉంటుందన్నారు. ఓట్ల చోరీని అడ్డుకోవాల్సిన కాపాలా కుక్కు..దొంగలను చూస్తు నిలబడుతోందని ధ్వజమెత్తారు. ఆ ఓట్ల దొంగలకు మద్దతుగా అనైతిక చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.
లక్షలాది మంది ఓటర్లను క్షణాల్లోనే ఓటర్ల జాబితా నుండి తొలగించబడుతున్నారు, ఉద్దేశపూర్వకంగా పోల్ బాడీ కండ్లు మూసుకుందని, ఉదయం 4 గంటలకు మేల్కొని…36 సెకన్లలో ఇద్దరు ఓటర్లను తొలగించి,…ఆపై తిరిగి నిద్రపోతుందని – ఓటు దొంగతనం జరుగుతున్నా.. ఎన్నికల నిఘా సంస్థ ఓట్ల దొంగతనాన్ని చూస్తూనే ఉంది, దొంగలను కాపాడుతూనే ఉంది,ష అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.