నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ మీడియాతో చీట్ చాట్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక ఎన్నికలు జరపడం కష్టమని తెలిపారు. అదే విధంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా మాట్లాడారు. కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల జీతాల నుంచి రూ.5000లు ఆ పార్టీకే వెళ్తుందని అన్నారు. నిధులు సైతం బీఆర్ఎస్‌కే వెళ్తున్నాయని తెలిపారు. అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ తమకు 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, సమయం కేటాయించాలని కోరారని గుర్తుచేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES