Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూ సర్వేలను వేగవంతంగా పూర్తి చేయాలి

భూ సర్వేలను వేగవంతంగా పూర్తి చేయాలి

- Advertisement -

అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్.ఖీమ్యా నాయక్
నవతెలంగాణ – వనపర్తి

భూ రికార్డుల నిర్వహణ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సర్వేయర్లు భూ సర్వేలను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ఖీమ్యా నాయక్ ఆదేశించారు. శుక్రవారం ఐ.డి. ఒ .సి లోని తన చాంబరులో అదనపు కలెక్టర్ జిల్లాలోని మండల సర్వేయర్లతో భూ రికార్డుల సర్వే, భూమి సంబంధిత సమస్యల పరిష్కారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ F-లైన్ దరఖాస్తులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని మండల సర్వేయర్లను ఆదేశించారు. అంతేకాకుండా, భూసేకరణకు సంబంధించిన సర్వే పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. (అసైన్డ్ ల్యాండ్స్), భూదాన భూములు, ప్రభుత్వ భూములకు సంబంధించిన GIS మ్యాపింగ్ పనులను పూర్తి చేయాలని, అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సర్వేయర్లకు స్పష్టం చేశారు. ఈ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయడం ద్వారా భూ రికార్డుల నిర్వహణ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎ.డి. సర్వే ల్యాండ్ బాలకృష్ణ, అన్ని మండలాల సర్వేయర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -