– కళా నైపుణ్యం పెంపుతో వృత్తిలో రాణింపు: హెచ్ ఎం హరిత
నవతెలంగాణ – అశ్వారావుపేట
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బ్యూటీ కోర్స్ నిర్వహణలో భాగంగా విద్యార్ధులకు శుక్రవారం మెహందీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు విద్యార్ధినీ విద్యార్ధుల్లో అనూహ్య స్పందన వచ్చింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత మాట్లాడుతూ కళా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని వృత్తి పరమైన నైపుణ్యాలు అభివృద్ధి చెందితే జీవనోపాధి తో పాటు సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని అన్నారు.అనంతరం ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు అందచేశారు.మొదటి బహుమతిని 8 వ తరగతి విద్యార్ధి యస్.కె రింషా,ద్వితీయ బహుమతి 10 వ తరగతి విద్యార్ధి యస్.కె సుమన్య, తృతీయ బహుమతిని 10 వ తరగతి కి చెందిన ఎన్.మానస గెలుపొందగా వీరితో పాటు మరో ఇద్దరు అబ్బాయిలు ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్యూటీ కోర్స్ ఇంచార్జి యాకూబ్బీ, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు పాల్గొన్నారు.
జెడ్పీహెచ్ఎస్ లో మెహందీ పోటీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES