Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిషేధిత గంజాయి తరలిస్తున్న నిందితులు అరెస్ట్.!

నిషేధిత గంజాయి తరలిస్తున్న నిందితులు అరెస్ట్.!

- Advertisement -

కాటారం డిఎస్పీ సూర్యనారాయణ..
నవతెలంగాణ – మల్హర్ రావు
: ప్రభుత్వ నిషేధిత గంజాయిని తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లుగా కాటారం డిఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. కాటారం సిఐ నాగార్జున రావు, ఎస్ఐలు నరేశ్, రాజన్ కుమార్ తో కలిసి కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని గట్టుపల్లిలో మూతబడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద నిషేధిత గంజాయ్ రవాణా, అమ్మకాలు, కొనుగోలు చేస్తున్నారనే సమాచారం మేరకు శుక్రవారం కొయ్యుర్ ఎస్ఐ నరేశ్ తన సిబ్బందితో వెళ్లి చాకచక్యంగా కొయ్యుర్ గ్రామానికి చెందిన యాదండ్ల సందీప్, కొండంపేట గ్రామానికి చెందిన కంపల్లి సాయికుమార్, మల్లారం గ్రామానికి చెందిన భూక్య రాజు, ఎండి అజారోద్దీన్ నలుగురు నిందితులను పట్టుకొని వారివద్ద నుంచి 1.23 కిలోల, రూ.61.500 విలువగల గంజాయిని పట్టుకున్నట్లుగా తెలిపారు.

పట్టుబడిన నిందితులు గంజాయికి బానిసై ఈ నెల 14న ఒడిశాలోని మోటు అనే మారుమూల గ్రామానికి బస్సులో వెళ్లి అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఈనెల 17న తీసుకొచ్చి అందులో కొంత సేవించి మిగిలిన దాన్ని 100 గ్రాములకు రూ.500 చొప్పున గంజాయి అలవాటు ఉన్న చుట్టుపక్కల వారికి విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నట్లుగా నిందితులు విచారణలో తెలిపినట్లుగా డిఎస్పీ వెల్లడించారు. కాటారం డివిజన్ పరిధిలోని యువత డ్రగ్స్ కు బానిసై భవిష్యత్ నాశనం చేసుకోవద్దని,బానిసై నేరాలకు పాల్పడితే కొత్త చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -