Friday, May 9, 2025
Homeరాష్ట్రీయం18న ఇందిరా సౌరగిరి జలవికాసానికి శ్రీకారం

18న ఇందిరా సౌరగిరి జలవికాసానికి శ్రీకారం

- Advertisement -

– రూ.12,600. కోట్లతో ఏర్పాటు
– ఉన్నతాధికారులతో మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈనెల 18న అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరులో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గురువారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సమీక్షించారు. గిరిజనులకు ఆర్‌ వో ఎఫ్‌ ఆర్‌ చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చేం దుకు, గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రూ. 12,600 కోట్ల రూపాయలతో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని చేపడుతుననట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకం ప్రారంభానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు యావత్తు మంత్రి మండలి పాల్గొంటారని తెలిపారు. ఇందుకోసం అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకొని దానిని అమలు చేసేలా ముందుకు వెళ్లాలని సూచించారు. రానున్న ఐదేండ్లకాలంలో 2.10 లక్షల మంది రైతులకు సంబంధించిన ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఇందిరా సౌర గిరి జల వికాసం ఉపయోగప డుతుందన్నారు. అడవిలో పోడు భూముల సాగుకు కావలసిన విద్యుత్తు సరఫరాకు అటవీశాఖ అనుమతి నిరాకరిం చడంతో దశాబ్దాల తరబడి నిరీక్షిస్తున్న గిరిజన రైతులకు ఈ పథకం ఒక వరం లాంటిదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏకకాలంలో గిరిజనులు పోడు భూములు సాగు చేసుకోవడానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదని గుర్తు చేశారు. ఈ పథకం అమలులో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు, విద్యుత్తు, ఉద్యాన వన శాఖ అధికారుల పాత్ర కీలకమన్నారు. పట్టాలు పొందిన గిరిజనుల గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాల్లోని భూముల్లో జల వనరుల లభ్యత కోసం జియాలజికల్‌ సర్వే, తదుపరి బోర్లు వేయడం, సోలార్‌ పంపు సెట్లు బిగించడం, ప్లాంటేషన్‌, డ్రిప్‌ ఏర్పాటు చేయించి గిరిజన రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. అవకాడో, వెదురు, దానిమ్మ డ్రాగన్‌ ఫ్రూట్‌, అంజీర్‌ వంటి పంటలు గిరిజనులు సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించుకొని గిరిజన రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పంటల సాగు జరుగుతున్న తీరుపై గిరిజన రైతులకు అవగాహన కల్పించేందుకు స్టడీ టూర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పామాయిల్‌, వెదురు వంటి పంటలు చేతికి రావాలంటే కనీసం మూడు సంవత్సరాల సమయం పడుతుందని చెప్పారు. ఈలోపు గిరిజనులకు ఆదాయం సమకూరేం దుకు అవసరమైన అంతర పంటల సాగును గుర్తించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో న్యాచురల్‌ ఫార్మింగ్‌ ద్వారా ఆర్గానిక్‌ కూరగాయలను పండించి ఢిల్లీకి ఎగుమతి చేస్తున్న మాదిరిగానే ఐటిడిఏ ప్రాజెక్టు పరిధిలోని ఏజెన్సీ ఏరియాల్లో ఇదే తరహాలో కూరగా యలను పండించి హైదరాబాదుకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కూరగా యల సాగుపై గిరిజన రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. దీని ద్వారా రైతులకు అదనంగా ఆదాయం వస్తుందన్నారు. అడవులను పెంచు తూనే, గిరిజనులకు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఈ పథకం అమలు కోసం రూపొందించిన విధి విధానాలను ట్రైబల్‌ వెల్ఫేర్‌ సెక్రెటరీ శరత్‌ డిప్యూటీ సీఎంకు వివరించారు. రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీ, జిల్లా స్థాయి అమలు, కొనుగోలు కమిటీ, ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అడవిలో సాగునీటి వసతి, కరెంటు సౌకర్యం లేకుండా దశాబ్దాల తరబడి పంటలు పండించుకోవడానికి నిరీక్షిస్తున్న గిరిజన రైతులు ప్రభుత్వం తీసుకొస్తున్న ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు ఉపముఖ్యమంత్రికి వివరించారు. ఈసమావేశంలో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, వ్యవసాయ శాఖకార్యదర్శి రఘునందన్‌ రావు, డిప్యూటీ సీఎం స్పెషల్‌ సెక్రెటరీ కష్ణ భాస్కర్‌, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూకి, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి, ఉద్యాన శాఖ కమిషనర్‌ యాస్మిన్‌ భాష పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -