Friday, May 9, 2025
Homeబీజినెస్పిడబ్ల్యుసిలో 1500 మందిపై వేటు

పిడబ్ల్యుసిలో 1500 మందిపై వేటు

- Advertisement -

వాషింగ్టన్‌: ప్రముఖ ఆడిటింగ్‌ సంస్థ ప్రైస్‌ వాటర్‌హౌజ్‌ కూపర్స్‌ (పిడబ్ల్యుసి) తమ 1,500 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ ఉద్యోగుల తొలగింపు దాని మొత్తం సిబ్బందిలో 2 శాతంగా ఉంది. ఆడిట్‌, ట్యాక్స్‌ విభాగాలకు చెందిన బాధిత ఉద్యోగులకు ఆన్‌లైన్‌ మీటింగ్‌ ద్వారా ఉద్వాసనల సమాచారం అందించడం గమనార్హం. మారుతున్న మార్కెట్‌ పరిస్థితుల మధ్య దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించే లక్ష్యంతో ఆలోచనాత్మకంగానే ఈ చర్య తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. దీంతో ముఖ్యంగా అమెరికా కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని తెలుస్తోంది. ఆర్థిక అనిశ్చితి, మారుతున్న ఖాతాదారుల డిమాండ్లు, పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా ఇటీవల డెలాయిట్‌, కెపిఎంజి వంటి సంస్థలు కూడా ఇటీవల తొలగింపులను ప్రకటించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -