బెంగళూరు: ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 33 శాతం వృద్ధితో రూ.5,002.66 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.3,757.23 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో బ్యాంక్ మొత్తం వడ్డీ ఆదాయం 28,807 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ4లో 7.62 శాతం పెరిగి రూ.31,002.04 కోట్లకు పెరిగింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు ఏకంగా 2.94 శాతానికి తగ్గాయి. 2024 మార్చి ముగింపు నాటికి జిఎన్‌పిఎ 4.23శాతంగా ఉంది. నికర ఎన్‌పిఎలు 1.27 శాతం నుంచి 0.70 శాతానికి దిగివచ్చాయి. గ్లోబల్ డిపాజిట్లు 11.01 శాతం పెరిగి రూ.14,56,883 కోట్లకు చేరినట్లు ఆ బ్యాంక్ వెల్లడించింది.