- Advertisement -
హైదరాబాద్ : ఎఐ ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ సొల్యూషన్స్ సంస్థ క్వాలిజీల్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్)లో భాగంగా హైదరాబాద్‌లో పేద యువతకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేసినట్లు తెలిపింది. నిర్మాన్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొంది. ఇది తమ డిజిటల్ సాధికారత నిబద్ధతకు నిదర్శనమని క్వాలిజీల్ సహ వ్యవస్థాపకుడు మధుమూర్తి రోణం పేర్కొన్నారు. యువతలో ఉత్సుకతను రేకెత్తించడం, అవకాశాలను అందించడం, ప్రాధమిక స్థాయి నుండి భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రతిభను ప్రోత్సహించాలని తాము కోరుకుంటున్నామన్నారు.
- Advertisement -