– సెన్సెక్స్ 400 పాయింట్లు పతనం
– కుప్పకూలిన పాక్ స్టాక్ ఎక్సేంజీ
ముంబయి: భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్లలో ఆందోళన ను రేకిత్తించాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు బదులుగా పాక్ భారత్‌లోని సరిహ ద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు పాల్పడు తోందనే రిపోర్టులు మార్కెట ్లలో ప్రతికూలతను పెంచాయి. మరోవైపు భారత సైన్యం దాడుల్లో లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమై నట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాలు దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. ముఖ్యంగా చివరి గంటలో అమ్మకాల వెల్లువ చోటు చేసుకోవడంతో గురువారం బిఎస్ ఇ సెన్సెక్స్ 411.97 పాయింట్లు లేదా 0.51 శాతం పతనమై 80,334.81కి పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 140.60 పాయింట్లు లేదా 0.58 శాతం నష్టంతో 24,273.80 వద్ద ముగిసింది. నిఫ్టీలో మిడ్‌క్యాప్ 100 సూచీ 1.95 శాతం, స్మాల్‌క్యాప్ 1.43 శాతం చొప్పున పతనమ య్యాయి. నిఫ్టీలో ఐటి, మీడియా రంగాలు మిగితా అన్నీ ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. ఆటో, ఎనర్జీ, ఎఫ్‌ఎంసిజి, రియాల్టీ, లోహ, ఫార్మా, ఆయిల్ అండ్‌గ్యాస్ తదితర రంగాలు 1 శాతం పైగా నష్టపోయాయి. సెన్సెక్స్30లో 26 సూచీలు నేల చూపులు చూశాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, టైటన్ షేర్లు స్వల్పంగా పెరిగాయి. ఎటర్నల్ (జొమాటో) 3.97 శాతం, ఎంఅండ్‌ఎం 3.36 శాతం, బజాజ్ ఫిన్ 2.19 శాతం, మారుతి సుజుకి 2.04 శాతం, టాటా స్టీల్ 2.19 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి.
నిలిచిన పాక్ స్టాక్ ఎక్చేంజీ
భారత వైమానిక దాడుల దెబ్బకు పాకిస్థాన్ మార్కెట్లు కుప్పకూలాయి. బుధవారం సెషన్‌లో నూ భారీ నష్టాలు చవి చూసిన కెఎస్‌ఇ-30 సూ చీ గురువారం మరో 7.2 శాతం పతనమయ్యిం ది. కరాచీ సమీపంలో భారత సైనిక బలగాలు విరుచుకుపడ్డాయన్న సమాచారం వ్యాపించడం తో అరగంట పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు.
ఆ రంగాల్లో స్థిరమైన ఫలితాలు :
టాటా అసెట్ మేనేజ్‌మెంట్
మార్కెట్లు ఇటీవలి పటిష్టమైన ర్యాలీ అనంతరం మళ్లీ నిలకడైన కాంపౌండెడ్ ప్రయోజనాలు ఇచ్చే స్టాక్స్‌వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించే అవకాశం ఉందని టాటా అసెట్ మేనేజ్‌మెంట్ ఫండ్ మేనేజర్ సోనమ్ ఉదాసీ పేర్కొన్నారు. టారిఫ్‌లపరంగా కఠినతర పరిస్థితులు నెలకొన్న తరుణంలో దేశీయ పరిస్థితుల ఆధారిత రంగాలు ఫైనాన్షియల్స్, యుటిలిటీస్, ఎనర్జీ, సిమెంట్, పెట్రోకెమికల్స్, సర్వీసెస్, డిఫెన్సివ్ ఎఫ్‌ఎంసిజి వంటి స్థిరమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. భారతీయ ఈక్విటీ మార్కెట్ అప్రమత్తతతో కూడుకున్న ఆశావహ దశలో ఉందన్నారు. 2024-25 చివరి త్రైమాసికంలో చాలా కంపెనీలు చెప్పుకోతగ్గ ఆదాయ వృద్ధి సాధించినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ యుద్ధాల విస్తృత ప్రభావాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయని టాటా అసెట్ మేనేజ్‌మెంట్ పేర్కొంది.
మార్కెట్లలో ఉద్రిక్తతల భయాలు
- Advertisement -
- Advertisement -