Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంవాట్సాప్‌కు నష్టపరిహారం చెల్లించండి

వాట్సాప్‌కు నష్టపరిహారం చెల్లించండి

- Advertisement -

– ఇజ్రాయిల్‌ సంస్థకు అమెరికా కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ:
ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూపునకు అమెరికా న్యాయస్థానం షాక్‌ ఇచ్చింది. ఈ గ్రూపుపై నమోదైన సైబర్‌ గూఢచర్యం కేసులో మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌కు సుమారు 168 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. ఎన్‌ఎస్‌ఓ గ్రూపు పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించి మెసేజింగ్‌ వేదికలోని వినియోగదారుల స్మార్ట్‌ఫోన్లను హ్యాక్‌ చేసిందంటూ 2019లో ఉత్తర కాలిఫోర్నియాలోని ఫెడరల్‌ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. యాప్‌ ద్వారా పాత్రికేయులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, ఇతరులను ఎన్‌ఎస్‌ఓ లక్ష్యంగా చేసుకున్నదని ఆరోపిస్తూ వాట్సప్‌ ఆ కేసు పెట్టింది. ఎన్‌ఎస్‌ఓకు చెందిన నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తోందో విచారణలో బహిర్గతమైందని మెటా ఓ బ్లాగులో వ్యాఖ్యానించింది. పెగాసస్‌ స్పైవేర్‌ ఓ పరికరంలోని యాప్‌ నుండి రహస్యంగా డేటాను సేకరించి వినియోగదారులకు తెలియకుండానే ఫోన్‌ కెమేరా లేదా మైక్రోఫోన్‌ను రిమోట్‌గా యాక్టివేట్‌ చేయగలదని మెటా తెలిపింది. కేసును విచారించిన అమెరికా న్యాయస్థానం నష్టపరిహారంగా 444,719 డాలర్లు, శిక్షార్హమైన నష్టం కింద మరో 162,254,000 డాలర్లు వాట్సాప్‌కు చెల్లించాలని తీర్పు చెప్పింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad