నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని మాలుతుమ్మెద ప్రభుత్వ విత్తనోత్పత్తి క్షేత్రంలో గోదాముల్లో నిలువ ఉన్న వరి ధాన్యానికి వేలం నిర్వహించినట్టు క్షేత్ర ఏడీఏ ఇంద్రసేన్ తెలిపారు. ఈ వేలంలో 7 గురు వ్యాపారులు పోటీ పడగ మండలం లోని పోచారం గ్రామానికి చెందిన స్కైలాబ్ గౌడ్ అందరికన్నా ఎక్కువగా పాటపడి వేలాన్ని దక్కించుకున్నారు. ఒక క్వింటాల్ ధాన్యానికి 1590 రూపాయలకు పాటపాడి వేలం పొందినట్టు ఏడీఏ తెలిపారు. క్షేత్రం లోని గోదాముల్లో 429 క్వింటాల్ దాన్యం నిలువ ఉందని, అయితే రబీలో వానలు కురవడం వల్ల దాన్యం కల్లాల్లో ఆరబోసిన దాన్యం తడిసి చాలా వరకు తడిసిపోయింది. దీంతో ఎం ఎస్ పి ధర కన్నా తక్కువగా వచ్చినట్టు ఏ డి ఏ వివరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏ ఓ మోహన్ రెడ్డి,ఆర్ ఎం రఘు, ఏ ఎమ్ సి కార్యదర్శి శ్రీనివాస్, ఏఓ ఆచరిత, ఏఈఓ శ్యాం సుందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మాల్ తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రంలో దాన్యం వేలం నిర్వహణ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES