– సహాయం చేయడానికి వెళ్ళిన వ్యక్తి మృతి
– మరొకరికి తీవ్ర గాయాలు
– రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై టయోటా కారు బీభత్సం సృష్టించింది. బ్రేక్ డౌన్ అయిన కారు టైరు మార్చడానికి వెళ్లిన ఒక వ్యక్తిని టయోటా కారు వేగంగా ఢకొీట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెం దాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్తున్న ఒక కారు రాజేంద్రనగర్ హిమాయత్‌సాగర్ వద్ద బ్రేక్ డౌన్ అయింది. వెంటనే ఆ కారు డ్రైవర్ ఔటర్ రింగ్ రోడ్ సిబ్బందికి సమాచారం అందించా రు. రికవరీ వ్యాన్ డ్రైవర్ శివకేశవ (40) అక్కడకు చేరుకొని బ్రేక్ డౌన్ అయిన కారు టైరు మారుస్తున్నాడు. అదే సమయంలో శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న టయోటా కారు మితిమీరిన వేగంతో బ్రేక్ డౌన్ అయిన కారును రిపేర్ చేస్తున్న శివ కేశవులును ఢ కొట్టి, ముందున్న మూడు కార్లను ఢ కొట్టింది. దాంతో శివకేశవ ఎగిరి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి ప్రయాణికులు గాయా లైన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచా రంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న మూడు కారులను అక్కడ నుంచి తొలగించారు. టయోటా కారు డ్రైవర్ మితిమీరిన వేగం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టయోటా కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఔటర్‌పై టయోటో కారు బీభత్సం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES