- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మదనపల్లెలోని సైదాపేటకు చెందిన సాదియా రీలింగ్ పని చేసేందుకు వెళుతూ తన కుమార్తె అలిజ(2)ను వెంట తీసుకెళ్లింది. తల్లి పనిలో నిమగ్నం కాగా.. చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీళ్లు అనుకుని టార్పెంట్ ఆయిల్ తాగింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. కళ్ల ముందే బిడ్డ మరణించడంతో తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది.
- Advertisement -